WEBSITE FRAUD
కర్నూలు, డిసెంబర్ 27 : మీరు ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ఏరియా డీలర్ షిప్ వెబ్ సైట్ కోసం వెతుకుతున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఈ తరహా మోసంలో సైబర్ నేరగాళ్లు ప్రముఖ కంపెనీకి సంబoధించినటువంటి వెబ్ సైట్ లను పోలీనట్లుగానే నకిలీ వెబ్ సైట్ ను తమ పేరిట రిజిష్ట్రేషన్ చేయించుకొని వాటిని నిజమైనవిగా బాధితులను నమ్మింప చేసి ఆ వైబ్ సైట్ ల పేరిట పెద్ద మొత్తాలలో ఏరియా డీలర్ షిప్ కొరకు డబ్బులను కట్టించుకొని మోసలకు పాల్పడుతున్నారు.
ఈ తరహా మోసంతో సైబర్ నేరగాళ్ళు ఆత్మకూర్ కు చెందిన ఒక వ్యక్తిని మోసానికి గురిచేశారు. మొదటగా సైబర్ నేరగాళ్ళు ప్రముఖ కంపెనీ ఎబిసిడి వెబ్ సైట్ ను పోలి ఉండేవిధంగా నకిలీ వెబ్ సైట్ ను తమ పేరిట రీజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డీలర్ షిప్ కొరకు అందులో పొందుపరిచిన ఫోన్ నంబర్లను సంప్రదించిన బాధితుని నుండి పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమన్నారు. ఆ డబ్బును కట్టిన తర్వాత ప్రోసెసింగ్ ఫీజు కొరకు మరింత డిమాండ్ చేయగా ఆ వ్యక్తి ఆ డబ్బును కూడ కట్టాడు. ఈ విధంగా బాధితుడు నుండి రూ. 2 లక్షల 64 వేలు కట్టించుకుని మోసం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోన్ నంబర్ ను సంప్రదించగా ఆ ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది .
బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగినది . కావున ఏదైనా వెబ్ సైట్ లలోని ఫోన్ నెంబర్ లకు సంబంధించిన వ్యక్తులను సంప్రదించే విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి .
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.