Special Recharge Offers Frauds

మీరు ఫోన్ పే,  గూగుల్ పే , పే టిఎమ్  మరియు ఇతరత్రా యుపిఐ యాప్స్  వాడుతున్నారా! అయితే  మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ,

 

 ఇటీవలే సైబర్ నేరగాళ్లు ఇటువంటి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్  వాడే వారినే తమ టార్గెట్ గా ఎంచుకుంటున్నారు .

 

ఈ మద్య కాలం లో మీకు ఎవరైనా ఫోన్ చేసి మేము ఫలానా సిమ్ కార్డు  ప్రొవైడర్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం .  మీకు మా కంపెనీ తో ఏళ్ల తరబడి అనుబంధం ఉన్న కారణంగా మీ నెంబర్ పై స్పెషల్ ఫ్రీ రీఛార్జి  ఆఫర్ ప్లాన్ ఇవ్వడం జరిగినది .

 

 ఈ ప్లాన్ ను మీరు వినియోగించుకోవడం కోసం మీ నెంబర్ కు వచ్చిన ఓటిపి (OTP) ని చెప్పండి  అంటూ ఎవరైనా ఫోన్ చేస్తున్నారా !

 

 మీరు  తొందరలో /కంగారు లో వారు అడిగిన ఓటిపి వివరాలు చెప్పినట్లయితే మీ ఖాతా నుండి డబ్బు మాయం అయ్యే అవకాశం ఉంది , మీరు జాగ్రత్తగా వ్యవహరించండి .

 

ఎందుకంటే మీరు ఇలా ఫోన్ వచ్చినప్పుడు చెప్పే ఒటిపి ఆధారంగానే సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంటు కు లింకు అయిన VPA (virtual payment Account)ను వినియోగించి మీ ఖాతా ను ఖాళీ చేస్తారు, ఈ virtual payment account ని వినియోగించి UPI (unified payments interface) ఎటువంటి లావాదేవీలైన  చేసే వీలును / అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు పొందుతారు.

 

 కావున ఈ విధంగా  ఫోన్ లు వచ్చిన విషయంలో స్పందించక పోవటం శ్రేయస్కరం.

 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు …

 

  1. మీకు ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి , మీ యొక్క వివరాలను అడిగిన యెడల మీ వివరాలు చెప్పకండి .

 

  1. మీకు వచ్చిన ఒటిపి ని కానీ మెసేజ్ ను కానీ ఎవరికి ఫార్వార్డ్ చేయకండి .

 

  1. మీ యొక్క వ్యక్తి గత, కార్డ్ వివరాలను , అకౌంటు వివరాలను ఎవరితోనూ పంచుకోకండి .

 

ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని,  సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *