• అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు.

• ముఖ్యంగా మహిళలు జాగ్రత్త ఉండాలి.

• రుణ యాప్ ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్మల సంఘటనలు జరిగాయి.

• సులువుగా రుణాలు ఇస్తున్నారని ఆన్ లైన్ రుణ యాప్ లకు అకర్షితులు కావద్దు.

• తెలియని ఆన్ లైన్ రుణయాప్ ల జోలికి వెళ్ళకండి … జిల్లా ఎస్పీ.

ప్రజలు ఆన్ లైన్ రుణ యాప్ లలో లోను తీసుకున్న తర్వాత అధిక వడ్డీ , కనిపించని చార్జీల పేరిట ఆన్ లైన్ రుణాల యాప్ నిర్వహకులు రుణ గ్రహీతల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్ళకు పాల్పడుతూ, వేధింపులకు గురి చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు ఆన్ లైన్ రుణాలు తీసుకోవడానికి లోన్ యాప్ లోకి ప్రవేశించగానే అగ్రిమెంట్ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు.

రుణం తీసుకునే వారికే లైవ్ వీడియో కాల్ చేసి వారి ఫోటోలు, ఫేస్(ముఖం) రికార్డు చేసి పూర్తి వివరాలను సేకరిస్తారు.

ఎవరైతే రుణం తీసుకుంటున్నారో వారికి ఓటిపి పంపించి ఒక లింక్ ను క్లిక్ చేయమని చెబుతారు. ఆ లింకును క్లిక్ చేయగానే మీ మొబైల్ నందలి సమాచారం ఆ లోన్ ఇచ్చే వారి సర్వర్ నందు స్టోర్ అవుతుంది.

తీసుకున్న రుణం(లోన్) మొత్తాన్ని చెల్లించ వలసిన సమయం పూర్తవ్వకముందే తిరిగి చెల్లించవలసినదిగా చెబుతారు. లేని పక్షం లో వారిని అసభ్య పదజాలం తో తిట్టడం చేస్తారు. చెల్లించాల్సిన గడువును పెంచుకున్నట్లయితే వడ్డీ రేట్లు అధికంగా చేయడం, ఆ మొత్తాన్ని చెల్లించలేని పక్షం లో మీ ఫోన్ నందు గల contacts కు మిమ్మల్ని దూషిస్తూ మెసెజ్ లను పంపుతారు.

ఇచ్చిన రుణం కంటే అధిక డబ్బులు డిమాండ్ చేస్తారు. పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తామని, బ్లాక్ మెయిల్ చేస్తారు. కొందరు భయపడి డబ్బులు కట్టేస్తారు.

అధిక డబ్బులు చెల్లించని వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫలానా కేసులలో నిందితులుగా ఉన్నారని వైరల్ చేస్తామని చెప్పడం, , తెలిసిన బంధువులకు మార్ఫింగ్ చేసిన నగ్నచిత్రాలను షేర్ చేస్తామని, సోషల్ మీడియాలో ఉంచుతామని బెదిరింపులకు గురి చేస్తారు.

ఆన్ లైన్ రుణాలు తీసుకున్న కొందరు వారి వేధింపులు తట్టుకోలేక రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో ఈ మధ్యనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది.

ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్ నుండి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు.

ప్రజలు కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలన్నారు.

వ్యక్తిగత సమాచారం, బ్యాంక్, ఆధార్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియజేయవద్దన్నారు.

డబ్బు అవసరమున్న ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎదుటి వ్యక్తులను నమ్మించి రుణాలు పొందాక ఇబ్బందులకు గురిచేస్తారనే విషయం గుర్తించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఆన్ లైన్ లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి, నమ్మకండి, రుణం తీసుకోవడం చేయకండి .

మీకు రుణం అవసరం అనుకుంటే బ్యాంక్ నందు కానీ లేదా తెలిసిన వ్యక్తుల నుండి రుణం తీసుకోవడం మంచిది.

మీరు ఎంత వీలైతే అంత ఆన్ లైన్ రుణ యాప్ లకు దూరంగా ఉండడం మంచిది.

ఎవరైనా పై విధంగా మోసపోతే సమీపంలోని పోలీసుస్టేషన్లో గాని, https://cybercrime.gov.in లేదా 1930 కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.

ఆర్ధిక అత్యవసరం నిమిత్తం రుణాలు తీసుకునే వారిని వేధిస్తున్న నకిలి రుణ యాప్ ల జాబితా ను Google Play స్టోర్‌లో అందుబాటులో ఉందని ఇటువంటి ఆన్ లైన్ రుణ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *