SBI Account Suspended Frauds
Topic : SBI Account సస్పెండ్ అయ్యింది… మీ SBI అకౌంట్ ను తిరిగి పొందుటకు మేము పంపించే లింక్ ను క్లిక్ చేయాలని సైబర్ నేరగాళ్ళ మోసాలు.
కర్నూలు, నవంబర్ 15 . సైబర్ నేరగాళ్ళు …, కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మీ SBI ACCOUNT సస్పెండ్ అయ్యింది…. మీ SBI ACCOUNT ను తిరిగి పొందుటకు మేము పంపించే లింక్ ను క్లిక్ చేసి అందులో వ్యక్తిగత వివరాలను నింపండి. అప్పుడే మీ యొక్క SBI ACCOUNT తిరిగి ఆక్టివేట్ అవుతుంది అని సైబర్ నేరగాళ్ళు చెప్పి మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తి గత సమాచారం సేకరించి మీ యొక్క ఖాతా లోని డబ్బులను మాయం చేస్తారు.
Google Search లో వివిధ అంశాలకు సంబంధించిన సేవలను పొందేందుకు పలు కంపెనీల ఫోన్ నెంబర్ ల కోసం గాలించి ఆ నెంబర్ లకు బాధితులు ఫోన్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
అదే విధంగా ఆదోనికి చెందిన ఒక వ్యక్తి online లో Clubfactory నందు Sun Glass కోనుగోలు చేశారు. Sun Glass Parcel అందిన తరువాత చూస్తే ఆ Sun Glass పగిలి ఉన్నాయి. బాధితుడు వెంటనే ఇంటర్ నెట్ లో customer care నెంబర్ కోసం గూగుల్ లో వెతికి ఆ కంపెని కస్టమర్ కేర్ నెంబర్ కి ఫోన్ చేశారు. ఆ కస్టమర్ కేర్ వారు మీ సమస్య ఏమిటని అడిగారు. బాధితుడు మాకు పంపిన Sun Glass పగిలి పోయాయి అని తెలిపాడు.
అంతట సైబర్ నేరగాడు మీ డబ్బులను మీ ఖాతాకు తిరిగి పంపిస్తామని చెప్పాడు. Google pay కు లేదా Phone pe ద్వారా డబ్బులను పంపుతాము అని చెప్పాడు. బాధితుడు ఆ మాటలు నమ్మి తన మొబైల్ లో Phone pe ఇన్ స్టాల్ చేసుకున్నాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు పంపిన link ను బాధితుడు క్లిక్ చేసాడు. Any Desk remote Control app ద్వారా ఆక్సిస్ చేసుకుని బాధితుని యొక్క SBI Account నుండి రూ. 75 వేల ను సైబర్ నేరగాడు కాజేసారు.
ఒక రాష్ట్రంలో అదే విధంగా Online లో ఆర్డర్ చేసిన ఫుడ్ బాగలేకపోవడంతో రీఫండ్ అడిగేందుకు Internet లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి ఓ యువకుడు ఫోన్ చేశాడు. అతడి కాల్ ఎత్తిన వ్యక్తి ఆ యువకుడి ఫోన్ కు ఓ లింక్ పంపించి డౌన్ లోడ్ చేసుకోవాలని… అందులో బ్యాంక్ ఖాతా వివరాలు ఎంటర్ చేయాలని సూచించాడు. దీంతో అతడు ఓటిపి ఎంటర్ చేశాడు. అంతే క్షణాల్లో ఖాతాలో ఉన్న రూ. 4 లక్షలు మాయం అయ్యాయి.
అందువలన సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా UPI transaction ను ఆధారంగా చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి తెలియని link లు మీ మొబైల్ లకు వచ్చినప్పుడు వాటిపై క్లిక్ చేయకూడదని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు దగ్గరలో గల స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.