Profile Pictures morphing crime in Social Media
కర్నూలు, జనవరి 24. మీరు facebook, Twitter, Instagram, WhatsApp మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారా! అయితే మీరు జాగ్రత్తగా ఉండండి.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మీరు ఆహ్లాదంకోసమో , ఆనందాన్ని పంచుకోవటం కోసమో సామాజిక మాధ్యమాల్లో పంచుకునే సమాచారమే మీకు హాని కలిగించేవిగా పరిణమిస్తుoది .
మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకొని సైబర్ నేరగాళ్లు తాము చేసే నేరాలను కప్పిపుచ్చుకొవడానకి వారి ఆధారాలకు బదులు మీ యొక్క సమాచారాన్ని పొందుపరచి మిమ్మల్ని వారు చేసే నేరాలకు బాధ్యుల్ని చేసే ప్రమాదం ఉంది.
మీరు పంచుకునే సమాచారం ఆధారంగానే సైబర్ నేరగాళ్ళు నేరాలకు పాల్పడే అవకాశం ఉంది, ముఖ్యంగా మహిళలు , యువతులు మీ ఫోటోలను కానీ, మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కానీ , profile గా మీ యొక్క ఫోటోలను కానీ సామాజిక మాధ్యమాల్లో ఉంచరాదు. మీరు అప్ లోడ్ చేసే ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని అశ్లీల వెబ్ సైట్ లకు పంపే ప్రమాదం ఉంది. మీకు హాని కలిగించే సమాచారాన్ని మీరే సామాజిక మాధ్యమాల్లో ఉంచి అజాగ్రత్తగా వ్యవహరించి అబాసు పాలుకావద్దండి . మీ యొక్క profile ఫోటోలను డౌన్లోడ్ చేసుకొని వాటిని అశ్లీలంగా చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామని సైబర్ నేరగాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
సామాజిక మాధ్యమాల్లో సమాచారాన్ని ఉoచేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలను పాటించడం శ్రేయస్కరం .
మీ సొంత ఫోటో ని profile పిక్ గా ఉంచరాదు.
మీకు పరిచయం లేని వ్యక్తుల నుండి వచ్చిన friend Requests లను accept చేయరాదు.
మీకు తెలియని link లను click చేయరాదు.
మీరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్న వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు .
మీ యొక్క సొంత విషయాలను, వ్యక్తిగత సమాచారాన్ని వీలైనoత గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.
మీ యొక్క సమాచారాన్ని పంచుకునే సమయంలో ఆ సమాచారాన్ని ఎవరు చూడవచ్చో సెక్యూరిటీ settings నందు 1. Only friends 2. Friends of friends అనే సౌకర్యాన్ని వినుయోగించుకోవటం మంచిది.
మీ యొక్క pass words తరచుగా మార్చుకుంటూ ఉండాలి.
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.