THROUGH THE SBI PHISHING LINK FRAUDS

 

 

సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త ….. కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు.

సైబర్ అలర్ట్ .

Topic : “THROUGH THE SBI PHISHING LINK FRAUDS”

మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంటుకు సంబంధించినటు వంటి KYC డిటైల్స్ అప్ డేట్ చేయని కారణంగా మీ అకౌంటు బ్లాక్ చేయబడినది అని ఒక లింకు తో కూడి నటువంటి మెసేజ్ వచ్చిందా !

మీరు ఆ మెసేజ్ ను నమ్మి ఆ మెసేజ్ లో ఉన్న టు వంటి లింకు ను క్లిక్ చేశారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడినట్లే , ఎందుకంటే ఈ మధ్య కాలం లో సైబర్ నేరగాళ్లు ఇటువంటి మెసేజ్ ను తమ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా ఈ రకమైన మెసేజ్ ను ఫార్వార్డ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

ఇటువంటి నేరాలలో మొదటగా సైబర్ నేరగాళ్లు తమ యొక్క మొబైల్ నెంబర్ నుండి మీ KYC అప్‌డేట్ చేయని కారణంగా మీ అకౌంటు ను బ్లాక్ చేయడం జరిగినది అంటూ ఇటువంటి లింకుhttp://Inkiy.in/z7wDQతో కూడినటువంటి మెసేజ్ ను ఫార్వార్డ్ చేస్తారు.

ఎవరైతే ఆ మెసేజ్ ను నమ్మి ఆ నెంబర్ కు ఫోన్ చేస్తారో అప్పుడు సైబర్ నేరగాళ్లు Any desk/Quick support/Team viewer వంటి రిమోట్ సపోర్టింగ్ Apps ను ఇన్స్టాల్ చేసుకోమని చెబుతారు, అటు పిమ్మట ఆ APP యొక్క రిమోట్ కనెక్టివిటీ కి సంబంధించిన కోడ్ చెప్పమంటారు.

మీరు ఆ కోడ్ చెప్పగానే సైబర్ నేరగాళ్లు , మీ మొబైల్ నందు మీరు ఏమీ ఆపరేట్ చేస్తున్నారు అనే విషయాన్ని చూడగలగుతారు, ఆ తర్వాత మిమ్మల్ని మీకు వచ్చిన టువంటి మెసేజ్ లోని లింకు ను ఓపెన్ చేసి ఆ లింకు నందు మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ user id, password డీటైల్స్ ను ఎంటర్ చేయమని చెబుతారు.

మీరు మీ యొక్క user id, password డీటైల్స్ ను ఎంటర్ చేయగానే రిమోట్ సపోర్టింగ్ App యొక్క సహాయం తో మీకు వచ్చిన OTP డీటైల్స్ ని వినియోగించి మీ యొక్క ఖాతా లోని డబ్బులను ఖాళీ చేస్తారు

కావున మీలో ఎవరికైనా ఇటువంటి మెసేజ్ వచ్చిన ఎడల ఆ మెసేజ్ నమ్మి ఆ మెసేజ్ లోని లింక్స్ క్లిక్ చేయకుండా తగు జాగ్రత్తలు పాటించగలరు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ….

  1. మీకు ఇటువంటి లింక్స్ వచ్చిన ఎడల వాటిని నమ్మకండి మరియు క్లిక్ చేయకండి.
  2. ఏ బ్యాంక్ వారు కూడా కస్టమర్ యొక్క KYC డీటైల్స్ కోసం మెసేజ్ పంపించరు. మీ యొక్క అనుమతి లేని ఎడల అకౌంటు ను బ్లాక్ చేయడం జరగదు.
  3. మీకు తెలియని లేదా రిమోట్ సపోర్టింగ్ Apps మీకు అవసరం లేని Apps ను మీ మొబైల్ లేదా డివైస్ నందు ఇంస్టాల్ చేసుకోకండి.
  4. మీరు ఏదైనా లింకు ఓపెన్ చేసే సమయం లో ఆ లింకు నందు http:// ఉందా లేక https://ఉందా చెక్ చేసుకోండి, https:// ఉన్న టువంటి లింకు ను మాత్రమే ఓపెన్ చేయండి.
  5. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడం కోసం ఈ కింద లింకు ను వినియోగించుకోగలరు https://retail.onlinesbi.com/retail/login.htm ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని లేదా cybercrime.gov.in లేదా టోల్ ఫ్రీ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 155260 ను సంప్రదించి ఫిర్యాదు చేయండి. జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *