Matrimonial frauds
కర్నూలు, నవంబర్ 22 . మీరు వివాహ సంబంధాల కోసం వివిధ మాట్రిమోనియల్ sites నందు వెతుకుతున్నారా ! అయితే మీరు మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఇటువంటి విషయాలలో సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది.
సైబర్ నేరగాళ్ళు తమ యొక్క నకిలీ ఫోటోలను మాట్రిమోనియల్ sites నందు ఉంచి తాను విదేశాలలో పని చేస్తున్నానని నమ్మించి మీరు నాకు నచ్చారు, మిమల్ని పెళ్ళి చేసుకోదలిచాను , అని నమ్మించి నీకు బహుమతిని పంపుతున్నాను అని చెప్పి వాటికి సంబధించిన TAX కట్టడానికి నువ్వు డబ్బులు వేయమని చెప్పి డబ్బులు వేయించుకొని ఫోన్ switch ఆఫ్ చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ళు ఈ తరహా మోసంతో నంద్యాలకు చెందిన ఒక యువతిని మోసం చేయడం జరిగినది. ఈ మోసం చేసిన నేరగాడు ముందుగా ఆ యువతిని ఒక మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం అయ్యాడు . తర్వాత తాను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి నేను మిమల్ని పెళ్లి చేసుకోదలిచాను. అని ఆ యువతిని నమ్మించాడు. నేను నీకు కొన్ని బహుమతులను పంపించాను వాటిని customs అధికారులు పట్టుకున్నారు.
నువ్వు ఆ బహుమతులను పొందాలంటే వాటికి సంబధించిన TAX కట్టడానికి నువ్వు డబ్బులు వేయమని చెప్పాడు. ఈ విషయాన్ని నమ్మి ఆ యువతి సైబర్ నేరగాడి ఖాతా కు డబ్బులు వేసింది అటు పిమ్మట ఆ మోసగాడు నేను నీకు డబ్బులను డాలర్ల రూపంలో పంపాను, వాటిని పొందడం కోసం నువ్వు RBI TAX కొరకు నువ్వు కొంత డబ్బును కట్టాలి అని చెప్పగా ఆ యువతి ఆ డబ్బులను సైబర్ నేరగాడి ఖాతాలో జమచేసింది. ఈ విదంగా ఆమె మొత్తం 78 వేలు వేసిన పిమ్మట ఆ నేరగాడికి నంద్యాల యువతి ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించక పోవటంతో తాను మోసపోయానని గ్రహించి పోలీస్ వారికి ఫిర్యాదు చేయడం జరిగినది.
సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు దగ్గరలో గల స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.