LOAN FRAUDS

కర్నూలు, డిసెంబర్ 20 : మీకు వివిధ apps ద్వారా మరియు నోటిఫికేషన్ ల ద్వారా లోన్ ఇస్తాం అంటూ ఏవరైనా మెసేజ్ లు పంపిస్తున్నారా, ఆ మెసెజ్ ల పై మీరు ఆసక్తి కనబరుస్తున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి.

 ఈ తరహా మోసం లో మొదటగా సైబర్ నేరగాళ్లు మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో లేదా  ఒక మెసేజ్ రూపంలో రుణ (లోన్) సౌకర్యం కల్పిస్తామని , రుణం కావాల్సిన వారు ఈ నెంబర్ ను సంప్రదించగలరు అంటూ ఒక నెంబర్ ను పంపుతారు , ఒకవేళ మీకు నిజంగానే అవసరం ఉంటే కనుక  మీరు ఆ నెంబర్ ను సంప్రదించినట్లయితే ఒకటవ సారి లోన్ ప్రోసెసింగ్ ఫీజు,  రెండవ సారి డాక్యుమెంట్ వెరీఫికేషన్ ఫీజు,  మూడవ సారి సెక్యూరిటీ డిపాజిట్ ఫీజు లు ధపాలుగా కట్టాలని  చెబుతారు. ఆ డిపాజిట్ ను కట్టిన పిమ్మట  మీరు కట్టిన డబ్బును కేవలం ఫార్మాలిటీ కొరకు కట్టించుకున్నాo,  మీరు కట్టిన డబ్బును మీ లోన్ తో పాటు మొత్తం ఇస్తాం అని నమ్మించి కొన్ని రోజులకి సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతిలో నేరాలకు పాల్పడుతున్నారు.

ఈ తరహా మోసంతో సైబర్ నేరగాళ్ళు కర్నూల్ నగరo లోని కల్లూరు కు చెందిన ఒక వ్యక్తిని మోసం చేయడం జరిగినది. మొదటగా సైబర్ నేరగాళ్లు ఒక మెసేజ్ ను పంపి లోన్ ఇస్తాం, ఈ కింది నెంబర్ ను సంప్రదించగలరూ అంటూ పంపారు. ఆ మెసేజ్ ను నిజమైనదిగా భావించి బాధితుడు ఆ నెంబర్ ను సంప్రదించగా, సైబర్ నేరగాడు మొదటగా ప్రొసెసింగ్ ఫీజు కింద రూ. 12 వేలు కట్టించుకున్నాడు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు రూ. 15 వేలు, మరల సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 25 వేలు ఈ విధంగా వివిధ పర్యాయలలో ఆ వ్యక్తి నుండి తన ఖాతాలో డబ్బులు వేయించుకున్న తర్వాత సైబర్ నేరగాడు సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడం జరిగినది. అతను మోసపోయాను అనే విషయం గ్రహించి బాధితుడు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగినది. కావున ఈ రకమైన మోసాలతో జాగ్రత్తగా వ్యవహరించండి. 

  ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని,  సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.

 

                    జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *