Fake Job Offer Frauds
మీరు ఉద్యోగం కోసం ఆన్ లైన్ వెబ్ సైట్స్ నందు దరఖాస్తు చేసుకున్నారా! మీకు ఎవరైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఇస్తాం? మీరు దానిని కరెక్ట్ చేసి పంపిస్తే మీరు చేసే పనిని బట్టి మీకు జీతం ఇవ్వబడుతుంది అని ఎవరైనా ఫోన్ చేశారా ? అయితే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది?.
సైబర్ నేరగాళ్లు ఇటీవలే తమ పంథాను మార్చి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు.
నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారో వారినే తమ టార్గెట్ గా ఎంచుకొని మొదటగా మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి మేము పలానా వెబ్ సైట్ నందు మీ యొక్క బయో డేటా చూసి మీకు ఉద్యోగ అవకాశం ఇస్తున్నాం అని చెబుతారు .
ఉద్యోగం కోసం ఎదురు చూసే మీరు ఆ ఫోన్ రాగానే ఆనందం లో మేము ఎలాంటి పని చేయాలి అని అడగగా , సైబర్ నేరగాళ్లు మీతో మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిని ఇస్తున్నాం! ఆ పని మీరు సరిగ్గా చేసి మాకు పంపాలి అని చెబుతారు.
మీతో ఉద్యోగ రీత్యా ఒక అగ్రిమెంట్ పై డిజిటల్ సిగ్నేచర్ తీసుకుంటారు. మీరు ఉద్యోగం లో చేరి పోయినట్టే అని చెబుతారు. మీకు ఒక డేటా ఎంట్రీ పనిని అప్పగిస్తారు .
మీరు ఆ పనిని సరిగ్గా చేసి పంపినా కూడా మీరు తప్పుగా చేశారని కంపెనీ యొక్క ఇమేజ్ నాశనం అయిందని దాని కోసం నష్టపరిహారం కట్ట మంటారు. లేక పోతే మీ పై పోలీస్ స్టేషన్ నందు కేసు పెడతామని బెదిరిస్తారు . ఆ మాటలకు భయపడి పోయి మీరు సైబర్ నేరగాళ్లు అడిగిన డబ్బును వేస్తారు .
కొన్ని రోజుల తర్వాత మీకు కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తున్నాం . వాటిని ఆపడం కోసం కొంత మొత్తాన్ని వేయమంటారు . ఆ మాటలకు భయపడి మీరు సైబర్ నేరగాళ్లు అడిగిన డబ్బును వేస్తారు . ఇలా పలు దఫాలలో మీ నుంచి డబ్బును వసూలు చేస్తారు .
మరి కొన్ని రోజులకి మీ కోసం పోలీస్ స్టేషన్ నందు సమస్య పరిష్కారం కోసం కొంత డబ్బును వేయమంటారు . అప్పటికే మీ నుండి కొంత మొత్తం లో డబ్బులు వసూలు చేసి ఉంటారు. కాబట్టి వారి తో విసుగు పోయిన మీరు మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించగా వారు సైబర్ నేరగాళ్లు అన్న విషయం తెలుసుకుంటారు.
ఇటువంటి నేర ప్రవృత్తితోనే సైబర్ నేరగాళ్లు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేయడం జరిగినది .
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి పై విధంగా ఎవరైనా సంప్రదిస్తే వారిని నమ్మకండి .
2. మీకు ఎవరైనా ఉద్యోగం ఇస్తున్నాం అని ఎవరైనా చెబితే మొదట మీరు ఆ కంపెనీ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారో లేదో చెక్ చేసుకోండి.
3. మీరు ఎవరైనా ఈ విధంగా నష్టపోయి ఉంటే మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ ను కానీ సైబర్ క్రైమ్ వారిని కానీ ఆశ్రయించండి .
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.