Job Offer Frauds

మీరు ఉద్యోగం కోసం అన్ లైన్ వెబ్ సైట్స్ నందు దరఖాస్తు చేసుకున్నారా !  మీకు ఎవరైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఇస్తాం మీరు దానిని కరెక్ట్  చేసి పంపిస్తే మీరు చేసే పనిని బట్టి మీకు జీతం ఇవ్వబడుతుంది అని ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా ఇటువంటి విషయాలపై సైబర్ నేరగాళ్ళు మోసాలకు గురి చేసే  అవకాశం ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. 

సైబర్ నేరగాళ్ళు ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఎవరైతే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారో వారినే తమ టార్గెట్ గా ఎంచుకొని మొదటగా మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి  మేము ఫలానా వెబ్ సైట్ నందు మీ యొక్క బయోడేటా / సివివి  చూసి మీకు ఉద్యోగ అవకాశం ఇస్తున్నాం  అని చెబుతారు .

            ఉద్యోగం కోసం ఎదురు చూసే మీరు ఆ ఫోన్ వినగానే ఆనందం లో  మేము ఎలాంటి పని చేయాలి అని అడగగా , సైబర్ నేరగాళ్లు మీతో  మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిని ఇస్తున్నాం అని ఆ పని మీరు సరిగ్గా చేసి మాకు పంపాలి అనిచెబుతారు . అటు పిమ్మట మీతో ఉద్యోగ రీత్యా ఒక అగ్రిమెంట్ పై డిజిటల్ సిగ్నేచర్  తీసుకుంటారు.

 మీరు ఉద్యోగం లో చేరి పోయినట్టే అనిచెబుతారు  ,అటు పిమ్మట మీకు ఒక డేటా ఎంట్రీ పనిని అప్పగిస్తారు , మీరు ఆ పనిని సరిగ్గా చేసి పంపిన కూడా మీరు తప్పుగా చేశారని , దాని వలన వాళ్ళ కంపెనీ యొక్క ఇమేజ్ నాశనం అయ్యిందని దాని కోసం నష్టపరిహారం కట్ట మంటారు .

లేక పోతే మీ పై పోలీస్ స్టేషన్ నందు కేసు పెడతామని బెదిరిస్తారు , ఆ మాటలకు భయపడి పోయి మీరు సైబర్ నేరగాళ్లు అడిగిన  డబ్బును వారి ఖాతాకు వేస్తారు , కొన్ని రోజుల తర్వాత  మీకు కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తున్నాం , వాటిని ఆపడం కోసం కొంత మొత్తాన్ని వేయ మంటారు , ఆ మాటలకు భయపడి మీరు సైబర్ నేరగాళ్లు అడిగిన డబ్బును వేస్తారు .

 ఇలా పలు దఫాలలో మీ నుంచి డబ్బును వసూలు చేస్తారు , మరి కొన్ని రోజులకి మీ కోసం పోలీస్ స్టేషన్ నందు సమస్య పరిష్కారం కోసం కొంత డబ్బును వేయ మంటారు , అప్పటికే మీ నుండి కొంత మొత్తం లో డబ్బులు వసూలు చేసి ఉంటారు.

            కాబట్టి వారి తో విసుగు పోయిన మీరు మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించగా వారు సైబర్ నేరగాళ్లు అన్న విషయం తెలుసుకుంటారు. ఇటువంటి నేర ప్రవృత్తి తోనే సైబర్ నేరగాళ్లు జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మోసం చేయడం జరిగినది .

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. మీకు ఎవరైనా ఉద్యోగం ఇస్తున్నాం అని ఎవరైనా చెబితే మొదట మీరు ఆ కంపెనీ లో ఉద్యోగం కోసం దరఖాస్తూ చేశారో లేదో చెక్ చేసుకోండి.
  1. ఎవరైనా ఈ విధంగా నష్టపోయి ఉంటే మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ ను కానీ సైబర్ క్రైమ్ వారిని కానీ ఆశ్రయించండి .

ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని,  సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.

                                    జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

3 Responses

  1. Everything is very open with a clear explanation of the issues. It was definitely informative. Your website is extremely helpful. Many thanks for sharing!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *