IT Returns Frauds
మీకు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ కింద ఫలానా అమౌంట్ వస్తుంది అని మీరు మీ అమౌంట్ ని క్లెయిమ్ చేసుకోవడం కోసం మీకు వచ్చిన ఈ మెసేజ్ నందు ఉన్న లింకు పై క్లిక్ చేయండి అంటూ ఏవైనా SMS వచ్చాయా !
మీరు ఆ మెసేజ్ ని నిజమైనదిగా భావించి ఆ లింకు నందు మీ వివరాలు పొందు పరిచారా ? అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి .
ఇటీవలే సైబర్ నేరగాళ్లు తమ యొక్క మొబైల్ నెంబర్ నుండి ఈ విధమైన సారాంశం కలిగిన మెసేజ్ ను పంపి మోసాలకూ పాల్పడుతున్నారు. ఈ విధమైన మోసాలలో సైబర్ నేరగాళ్లు మొదటగా మీకు ఐటి రిటర్న్స్ వచ్చాయి అని మెసేజ్ పంపుతారు. అలా ఆ మెసేజ్ ను నమ్మి ఎవరైనా ఆ యొక్క లింకు పై క్లిక్ చేయగా , ఆ లింకు ఓపెన్ అయి అందులో మీ యొక్క వ్యక్తిగత వివరాలు పొందుపరచమని ఉంటుంది .
వ్యక్తిగత వివరాల జాబితా నందు మీ యొక్క బ్యాంక్ అకౌంటు వివరాలు, కార్డ్ వివరాలు, మీ బ్యాంక్ అకౌంటు లింకు అయినటువంటి ఫోన్ నెంబర్ వివరాలు పొందు పరచమని ఉంటుంది. అలా మీ యొక్క వివరాలను పొందుపరచగానే మీ సెల్ ఫోన్ కు ఒక OTP (One time password) వస్తుంది ఆ లింకు యొక్క చివరి అంకె లో ఈ OTP వివరాలను ఎంటర్ చేయమని ఉంటుంది .
అలా మీరు OTP వివరాలు ఎంటర్ చేయగానే మీ యొక్క ఖాతా ఖాళీ అవుతుంది. ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు ప్రజల యొక్క ఖాతా ల నుండి డబ్బులను మాయం చేస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
- మీకు ఇటువంటి మెసేజ్ ఏవైనా వచ్చినట్లయితే వాటిని నమ్మకండి .
- మీ యొక్క వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుకోండి
- మీకు తెలియని లేదా నమ్మ శక్యం కానీ మెసేజ్ /లింక్ ల పై క్లిక్ చేయకండి.
- మీలో ఎవరైనా ఈ విధంగా మోస పోయి ఉంటే మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయండి .
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.