Gift Fraud
కర్నూలు, జనవరి 17. మీకు స్నాప్ డీల్ లో కారు గిఫ్ట్ తగిలిందని చెప్పి నంద్యాల, నూనెపల్లెకు చెందిన రేవంత్ అనే వ్యక్తి నుండి గూగుల్ పే ద్వారా డబ్బులను కట్టించుకుని సైబర్ నేరగాళ్ళు మోసానికి గురి చేశారు. అయితే మీరు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది….జాగ్రత్తగా వ్యవహరించండి.
విషయం… ఒక స్నాప్ డీల్ లో రేవంత్ టీ షర్ట్ కొరకు ఆర్డర్ చేశాడు. అయితే అతను టీ షర్టుకు ఆర్డర్ పెట్టిన సెల్ నెంబర్ కే లక్కీడ్రాలో మీరు కారును గిఫ్ట్ గా గెలుచుకున్నారని సైబర్ నేరగాళ్ళు మెసేజ్ చేసి ఫోన్ చేశారు. మీకు ఆ కారును పొందాలంటే కేవలం రూ. 15,000/- మాత్రమే కట్టాలని కట్టించుకున్నారు. లేకుంటే మీకు ఆ కారు అవసరం లేదనుకుంటే ఆ కారు విలువ మొత్తం నగదును రూ. 8,50,000 మీకు మా కంపెని నుండి మీ ఖాతాకు పంపిస్తామని చెప్పారు. ఆ పెద్ద మొత్తం ను మీ ఖాతా కు పంపించాలంటే కొంత ట్యాక్స్ కూడా పడుతుందని చెప్పి దానికి రూ. 8,500/- మరల తిరిగి ఇంకా ఎక్స్ ట్రా సర్వీస్ చార్జీల క్రింద రూ. 25,500/- కట్టించుకుని మోసం చేశారు. పలుమార్లు ఫోన్ లు చేసి ఒత్తిడికి గురి చేశారు. బాధితుడు మోసపోయానని గ్రహించి నంద్యాల మూడవ పట్టణ పోలీసుస్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది . కావున అటువంటి వాటిని నమ్మకండి ,జాగ్రత్తగా వ్యవహరించండి.
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.