Festival season Fake websites Fraud
కర్నూలు, జనవరి 03 : మీరు సంక్రాంతి పండగ వస్తుందని లేదా ఏదైనా వేడుక కొరకు ఆన్ లైన్ లో షాపింగ్ చేసే అలవాటు ఉందా అయితే మీరు సైబర్ నేరగాళ్ళ బారిన పడే అవకాశం ఉంది … జాగ్రత్త వహించండి.
సైబర్ నేరగాళ్లు ఈ వేడుకలను పురస్కరించుకొని e – కామర్సు సంస్థలు ఇచ్చే రాయితీలను ఎరగా వేసి చూపి సైబర్ నేరగాళ్లు వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
ఈ తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు పండగలను, ఇతర వేడుకలను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు ఒరిజినల్ వెబ్ సైట్స్ లను పోలీ ఉండే నకిలీ వెబ్ సైట్ లలో దుస్తులు, గృహో పకరణాల పై బారిగా రాయితీలను ప్రకటిస్తున్నారు. ఈ విధమైన వెబ్ సైట్సు పేజ్ జాకింగ్ అనే పద్దతిని ఉపయోగించి మోసం చేస్తున్నారు.
ఏవరైనా ఈ రాయితీలను చూసి దుస్తులు మరియు గృహోపకరణాలను కొనుగోలు కొరకు వైబ్ సైట్ ల ను సంప్రదించినట్లయితే ఆ వెబ్ సైట్ లలో మొదటగా మీ యొక్క వ్యక్తిగత వివరాలతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలను కూడా పొందుపరచమని తెలియజేస్తారు. మీరు కనుక వ్యక్తిగత ఖాతా వివరాలను పొందుపరిస్తే ఆ వివరాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు బాధితుల యొక్క బ్యాంక్ ఖాతాలలోని బాధితుల నగదును ఖాళీ చేస్తున్నారు, కావున ఆన్ లైన్ లో షాపింగ్ చేసే సమయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి.
ఎట్టి పరిస్ధితులలో కూడా ఎక్కడ కూడా మీ యొక్క వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయకూడదు. ఇటువంటి రాయితీలను ప్రకటిస్తూ సెల్ ఫోన్ కు వచ్చే మెసేజ్ మరియు కాల్సుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.