Fake Accounts Frauds Through Social Media
మీరు Facebook , Instagram, Twitter వంటి సామాజిక మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటున్నా రా!
మీకు ఇటీవల కాలంలో మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బులు వేయమని చెబితే మీరు డబ్బులను వేస్తున్నారా ! అయితే జాగ్రత్త వహించండి ఎందుకంటే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది .
ఎందుకంటే ఈ మద్య సైబర్ నేరగాళ్లు ఇటువంటి సామాజిక మాధ్యమాలలో బాగా చురుగ్గా ఉండే వారి స్నేహితుల వివరాలను సేకరించి , వాటి సహాయంతో మొదటగా సంఘం లో మంచి పేరు మర్యాదలు ఉన్న మీ స్నేహితుల సామాజిక మాధ్యమాలలోని అక్కౌంట్స్ ను పోలి ఉండే నకిలీ అక్కౌంట్స్ ను క్రియేట్ చేసి వాటి ద్వారా మొదటగా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు.
మీరు మన స్నేహితుడే కదా అని అనుకోని ఆ రిక్వెస్ట్ ను అంగీకరిస్తారు. అటు పిమ్మట మీతో కొన్ని రోజులు సంభాషించిన తర్వాత ఒకానొక రోజు మీకు ఆ నకిలీ అకౌంటు నుండి తనకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది అంటూ కొంత డబ్బును వేయమని అడుగుతూ అతని Phonepe/Google pay నెంబర్ ని ఇస్తాడు . మీరు ఆ సమాచారాన్ని నిజమైనది గా భావించి డబ్బులు వేస్తారు.
ఈ విధంగా సైబర్ నేరగాళ్ళు మీ ఇతర స్నేహితుల నుండి కూడా డబ్బులను వేయించుకుంటారు. డబ్బులు వేయించుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ నకిలీ అకౌంటు ను సామాజిక మాధ్యమాలలో తీసివేస్తారు .
మీ స్నేహితుడిని మీరు అనుకోకుండా కలసినప్పుడో, లేక మీకు అవసరమై మీరు వేసిన డబ్బును మీ స్నేహితుడిని అడగగా అతను ఏ డబ్బును తీసుకోలేదని చెప్పగా మీరు మోసపోయిన విషయం మీకు అర్థం అవుతుంది .
తీసుకోవాల్సిన జాగ్రత్తలు …
- ఎవరైనా మీ స్నేహితుల వలె సామాజిక మాధ్యమాలలో నుండి డబ్బులు అడిగిన ఎడల మీరు వేయకండి.
- మీ స్నేహితుల అకౌంట్స్ ను పోలి ఉండే ఖాతా నుండి వచ్చిన రిక్వెస్ట్ ను accept చేసే మునుపు అది నిజంగా మీ స్నేహితుడా కాదా అని తెలుసుకోండి .
- మీలో ఏవరైనా ఈ విధంగా మోసపోయిన ఎడల దగ్గర లోని పోలీస్ స్టేషన్ నందు కానీ సైబర్ మిత్ర నెంబర్ ను కానీ ఆశ్రయించండి.
ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.