Customer Care Fraud

కర్నూలు, నవంబర్ 15 . Google Search లో వివిధ అంశాలకు సంబంధించిన సేవలను పొందేందుకు పలు కంపెనీల ఫోన్ నెంబర్ ల కోసం గాలించి ఆ నెంబర్ లకు బాధితులు ఫోన్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారు.

అదే విధంగా ఆదోనికి చెందిన ఒక వ్యక్తి online లో Clubfactory నందు Sun Glass  కోనుగోలు చేశారు.  Sun Glass Parcel అందిన తరువాత చూస్తే ఆ Sun Glass పగిలి ఉన్నాయి. బాధితుడు వెంటనే  ఇంటర్ నెట్ లో  customer care నెంబర్ కోసం గూగుల్ లో వెతికి ఆ కంపెని కస్టమర్ కేర్ నెంబర్ కి ఫోన్ చేశారు. ఆ  కస్టమర్ కేర్ వారు మీ సమస్య ఏమిటని అడిగారు.  బాధితుడు మాకు పంపిన Sun Glass పగిలి పోయాయి అని  తెలిపాడు.  అంతట సైబర్ నేరగాడు మీ డబ్బులను మా company  ఖాతా నుండి మీ యొక్క  Google pay  Account కు  లేదా Phone pe  Account  కు తిరిగి పంపిస్తామని చెప్పాడు.  బాధితుడు  ఆ మాటలు నమ్మి తన మొబైల్ లో Phone pe  UPI యాప్ ను ఇన్ స్టాల్  చేసుకున్నాడు. ఆ తర్వాత  సైబర్ నేరగాడు పంపిన link ను బాధితుడు క్లిక్ చేసాడు. Any Desk remote Control app ద్వారా ఆక్సిస్ చేసుకుని బాధితుని  యొక్క SBI Account నుండి రూ. 75 వేల ను సైబర్ నేరగాడు  కాజేసారు.

  • కస్టమర్ కేర్ నెంబర్ కొరకు ఏవరైనా వ్యక్తులు Google Search లో వెతికినప్పుడు సైబర్ నేరగాళ్ళు గూగుల్ సెర్చ్ లో తప్పుడు నెంబర్ లు  పెట్టి ఆ నెంబర్ ల ద్వారా కస్టమర్ ని ట్రాప్ చేస్తున్నారు. (లేదా)
  • తప్పుడు Website Open చేసి కూడా కస్టమర్ ని మోసం చేస్తున్నారు. కొన్ని సమయాలలో కంపెని కస్టమర్ కేర్ నుండి కూడా ఫోన్ నెంబర్ లను తెలుసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.

అందువలన సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా UPI transaction ను ఆధారంగా చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన  link లను  మీ మొబైల్ లకు వచ్చినప్పుడు వాటిపై క్లిక్ చేయకూడదని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు దగ్గరలో గల స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.

                              జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *