Topic : సెల్ టవర్ వేస్తామని చెప్పి మోసగించడం.
కర్నూలు, నవంబర్ 08. సైబర్ నేరగాళ్ళు …, మేము central State Tower Pvt. Ltd. company నుండి ఫోన్ చేస్తున్నాము. మీ పొలంలో మా కంపెనీ తరపున సెల్ టవర్ వేస్తున్నాము. సెల్ టవర్ వేయడానికి మీ పొలం మాకు అనుకూలంగా ఉందని, మేము శాటిలైట్ ద్వారా మీ పొలంను చూసాము అని మాయ మాటలు చెప్పి, మీరు Registration Certificate కొరకు డబ్బులు పంపండి అని చెబుతారు.
మీరు కొంత డబ్బులు వారి ఖాతాలో వేసిన తర్వాత మీకు రూ. 4 లక్షలు డి.డి. వచ్చింది tax కూడా కట్టాలి అని మరల వారి ఖాతాలో రూ. 40 వేలు deposit చేయమని చెబుతారు. తరువాత మీ డి.డి. cancel అయ్యింది, మీకు N R I account open చేయాలి అని మరల అకౌంట్ లో కొంత డబ్బులు వేయమని చెబుతారు. అలా డబ్బులు వేయించుకున్న తర్వాత ఫోన్ లు switch off చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇదే తరహాలో నందికొట్కూరు కు చెందిన సురేష్ అనే వ్యక్తిని మోసం చేసి రూ.2,71,000/- (two lakhs seventy one thousand rupees) డబ్బులు వేయించుకొని మోసం చేసారు.
కావున ప్రజలు గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపి మోసపోవద్దు. సైబర్ నేరగాళ్ళు మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు దగ్గరలో గల పోలీసు స్టేషన్ లో గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.