సైబర్ అలర్ట్ ….. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.
ఆర్టికల్ నెంబర్. 41. DATED ….. 07.08.2020 (శుక్రవారం)
TOPIC : “ Card Cloning Frauds”
కర్నూలు, ఆగష్టు 07. ఎటిఎం, క్రెడిట్, డెబిట్ కార్డులను ఎక్కడపడితే అక్కడ స్వైప్ చేయడం వలన కార్డు క్లోనింగ్ జరిగి మీ ఖాతాలోని నగదును మరొక ఎటిఎం ద్వారా సైబర్ నేరగాళ్ళు విత్ డ్రా చేస్తున్నారని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
ఈ కార్డు క్లోనింగ్ జరగకుండా ఉండేందుకు మీ యొక్క ఎటిఎం, క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నెంబర్ లను తరచుగా మార్చుకుంటూ ఉండాలన్నారు.
మీ యొక్క అకౌంట్ కి ఉన్న ఆధార్ కార్డు లింకు ను కూడా పరిశీలించుకోవాలన్నారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను షాపింగ్ చేసే సమయంలో మీరు వాడినప్పుడు స్వైప్ చేస్తున్న షాపు నమ్మకమైనదా కాదా అని గమనించుకోవాలన్నారు.
ఈ విధంగా కార్డు క్లోనింగ్ జరిగి కర్నూలు నగరంలో సుమారు రూ. లక్ష వరకు డబ్బులను పొగొట్టుకున్నారన్నారు.
ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.