BANK KYC FRAUD
కర్నూలు, నవంబర్ 29 . మీ SAVING BANK ACCOUNT సస్పెండ్ అయ్యింది లేదా ATM లేదా CREDIT CARD / SIM CARD బ్లాక్ అయ్యింది అని మీకు ఫోన్ వచ్చిందా !
మీరు కంగారుపడి సైబర్ నేరగాడు పంపిన SMS లింకు ద్వారా మీ యొక్క వ్యక్తిగత సమాచారం పంపించారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో “ BANK KYC FRAUD “ కు గురయ్యే అవకాశం ఉంది.
సైబర్ నేరగాళ్ళు ఈవిధంగా…….మీ యొక్క SAVING BANK ACCOUNT ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఇచ్చిన DATE OF BIRTH తేడా ఉన్నది. ఆ SAVING BANK ACCOUNT ను (Re Activate ) పునరుద్దరణ చేయడానికి మేము మీ యొక్క మొబైల్ నెంబర్ కు SMS ద్వారా పంపించిన link ను క్లిక్ చేయాలని చెబుతూ, అధే విధంగా ఆ లింక్ లో కనబరచిన KYC డిటైల్స్(పూర్తి వివరాలను) ఫామ్ ని అప్ డేట్ చేయాలని చెబుతారు. లేదంటే మేము తెల్పిన ఒక ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని చెబుతారు.
సైబర్ నేరగాళ్ళు పంపిన ఆ SMS LINK ను క్లిక్ చేసి ఎంటర్ చేయగానే ఈ క్రింది నాలుగు వివరాలను అప్ డేట్ చేయాలని చెబుతారు. అందులో 1) DATE OF BIRTH, 2) మొబైల్ నెంబర్, 3) INTERNET BANKING USER ID , 4) ఇంటర్ నెట్ బ్యాంకింగ్ PASSWORD వివరాలను ఈ LINK ద్వారా ENTER చేయగానే బ్యాంకు ఖాతాదారుని యొక్క SAVING BANK ఖాతా యొక్క నగదును సైబర్ నేరగాళ్ళ ఖాతా కు ట్రాన్ఫర్ చేసుకుంటారు.
జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ముఖ్య గమనిక …. మీ యొక్క మొబైల్ ఫోన్ లను తెలియని మెసెజ్ లు గాని, ఫోన్ కాల్స్ గాని వచ్చినప్పుడు స్పందించ కూడదని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఏ లింక్ ను కూడా క్లిక్ చేసి అందులో వ్యక్తిగత సమాచార వివరాలను నమోదు చేయకూడదన్నారు. SMS లింకు ల ద్వారా యాప్ లను ఇన్ స్టాల్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఏ యాప్ ను కూడా ఇన్ స్టాల్ చేసుకోకూడదన్నారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి విషయాలపై ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని లని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.