Festival season Fake websites Frauds

దసరా , దీపావళి  పండగ వచ్చిందని  లేదా  ఏదైనా వేడుక కోసమై  ఆన్ లైన్  లో షాపింగ్ చేసే అలవాటు ఉందా అయితే మీరు సైబర్ నేరగాళ్ళ బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త!

 

 సైబర్ నేరగాళ్లు ఈ వేడుకలను పురస్కరించుకొని ఈ – కామర్స్ సంస్థలు ఇచ్చే రాయితీలను ఎరగా చూపి వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

 

 ఈ తరహా మోసంతో సైబర్ నేరగాళ్లు పండగలకు, ఇతర వేడుకలను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

 

ఈ తరహా మోసంలో సైబర్ నేరగాళ్లు ఒరిజినల్ వెబ్ సైట్స్ లను పోలి ఉండే నకిలీ వెబ్ సైట్స్ లలో దుస్తులు మరియు గృహోప కరణాల పై భారీగా రాయితీలను ప్రకటిస్తున్నారు.

 

ఈ విధమైన వెబ్ సైట్స్ ను పేజ్ జాకింగ్ (page jacking) అనే పద్దతిని ఉపయోగించి సృష్టిస్తున్నారు. ఎవరైనా ఈ రాయితీలను చూసి దుస్తులు మరియు గృహోపకరణాలను కొనటం కోసమై ఈ వెబ్ సైట్ ను సంప్రదించినట్లయితే ఆ వెబ్ సైట్స్ లలో  మొదట మీ వ్యక్తిగత వివరాలతో పాటు  మీ యొక్క బ్యాంక్ వివరాలను కూడా పొందుపరచమని చెబుతారు .

 

ఒక వేళ మీరు ఈ వివరాలను పొందుపరిస్తే ఆ వివరాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు వ్యక్తుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. కావున ఆన్ లైన్ లో షాపింగ్ చేసే సమయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి.


ఎట్టి పరిస్ధితులలో  కూడా ఎక్కడ కూడా మీ యొక్క వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ వివరాలు నమోదు చేయకండి.ఇటువంటి రాయితీలను ప్రకటిస్తూ సెల్ ఫోన్ కు వచ్చే మెసేజ్ మరియు కాల్స్ తో జాగ్రత్తగా ఉండండి.

 

ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని,  సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.

 

                             జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

Leave a Reply

Your email address will not be published.