జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన 75 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ డా. సృజన ఐఏయస్ గారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.
జిల్లా కలెక్టర్ గారితో కలిసి జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు జాతీయ జెండా కు గౌరవ వందనం చేశారు.
పరిశీలన వాహనం పై నుండి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారులు శాలువాలతో సత్కరించారు.
ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారులు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ బార్గవ్ తేజ్, SEB అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఐపియస్ గారు, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, అదనపు ఎస్పీలు నాగరాజు, నాగబాబు , డిఎస్పీలు , వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.