మీకు ఇటీవలే మీ నెంబర్ పై ఎవరో వాట్సప్ అకౌంటు వాడుతూ మీ పేరిట ఇతరులకు అసభ్యకరమైన సందేశాలను పంపుతున్నారని మీకు ఎవరైనా తెలిపారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు, ఇటువంటి నేరాలలో మొదటగా సైబర్ నేరగాళ్లు ఎవరో ఒక తెలియని వ్యక్తి కి సంబంధించిన మొబైల్ నెంబర్ పై WhatsApp ఆక్టివేట్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ పై WhatsApp అకౌంటు సెట్టింగ్స్ నందు (Two step verification) ను ఆక్టివేట్ చేసుకొని అందుకు ఒక కోడ్ ను పాస్వర్డ్ క్రింద సెట్ చేసుకున్న తర్వాత రికవరీ మెయిల్ ID కింద వారికి సంబంధించిన మెయిల్ ID ఇస్తారు . ఆ తర్వాత ఆ మొబైల్ నెంబర్ ను వినియోగించి ఇతరులకు అసభ్యకరమైనసందేశాలను మరియు అసభ్యకరమైన స్టేటస్ లు పోస్ట్ చేస్తారు, లేదా మీ యొక్క స్నేహితులకి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా డబ్బులు పంపమని అడుగుతారు . మీ స్నేహితులులలో ఎవరైనా మీ మొబైలు నెంబర్ ను వారి contacts కోసం సేవ్ చేసుకున్న ఎడల వారికి ఈ స్టేటస్ చూపిస్తుంది. అలా చూసిన మీ స్నేహితులలో ఎవరైనా మీకు ఈ విషయం తెలపగా మీరు మీ మొబైలు నందు మీ మొబైలు నెంబర్ WhatsApp అకౌంటు ఆక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించగా మిమ్మల్ని Two Step verification కు సంబంధించిన కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీకు ఆ కోడ్ తెలియని కారణంగా మీరు WhatsApp అకౌంటు ను ఆక్టివేట్ చేసుకోలేరు , ఈ విధంగా మీ ప్రమేయం లేకుండానే మీ మొబైలు నెంబర్ పై WhatsApp activate చేసుకొని మోసాలకు , నేరాలకు పాల్పడుతున్నారు .కావున ఇటువంటి నేరాల పై జాగ్రత్త వహించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..1. మీ మొబైలు నెంబర్ కు వచ్చిన OTP తదితర వివరాలు ఎవ్వరికీ చెప్పకండి. 2. మీ WhatsApp అకౌంటు నందు కల సెట్టింగ్స్ లోని అక్కౌంట్స్ నందు కల Two Step verification ను ఆక్టివేట్ చేసుకోండి. 3. మీలోఎవరకైనా ఈ విధంగా జరిగి మోస పోయిన ఎడల మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ నందు కానీ లేక సైబర్ క్రైమ్ వారికి కానీ ఫిర్యాదు చేయండి.ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.