కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్ గారి పర్యవేక్షణలో వాహనాలకు వేలం నిర్వహించారు .
మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనా లకు 4 రోజులుగా సాగిన వేలం పాటలు గురువారం ముగిశాయి.
మొత్తం 553 వాహనాలకు వేలం పాట జరుగగా 427 వాహనాలను ప్రజలు దక్కించుకున్నారు .
ఈ వేలాల ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ .1 కోటి 18 లక్షల ఆదాయం చేకూరిందని కర్నూలు సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్ గారు వెల్లడించారు .
మిగిలిన వాహనాలకు సంబంధించిన వాహనాల వేలం ను త్వరలోనే ఒక ప్రకటనలో వెల్లడిస్తామన్నారు