77th Indian Independence Day Celebrations at District Police Office
జిల్లా పోలీసు కార్యాలయంలో 77 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
ఈ వేడుకలలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖా మాత్యులు మరియు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకావిష్కరణ గావించారు.
అనంతరం మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్ర నాథ్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. సృజన ఐఏయస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారి తో కలిసి కవాతు వాహనం నుండి సాయుధ దళ పరిశీలన చేశారు.
ఏ ఆర్, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఫైర్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లాటూన్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టి, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు మంత్రి వర్యులు సందేశాన్ని చదివి వినిపించారు.
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు అధికారులు ఘన సన్మానం చేశారు.
విధులలో ప్రతిభ కనబరచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు , అడిషనల్ ఎస్పీలు , డిఎస్పీలు , సిఐలు,ఆర్ ఐలు, స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలు, విద్యార్థులు,ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.