Huge Rate of Interest on Daily Basis Frauds

మీరు పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు దినసరి మొత్తంలో వడ్డీ వస్తుంది అంటూ సంప్రదించారా ! మీరు అట్టి వ్యక్తిని నమ్మి డబ్బును వేస్తున్నారా , అయితే జాగ్రత్త వహించండి !

 

మీరు పెట్టిన పెట్టుబడికి మీకు రోజు వారీగా ఎక్కువ మొత్తం లో వడ్డీ వస్తుందని చెప్పి ప్రజలను నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

 

 ఇటువంటి నేరాలలో మొదటగా మిమ్మల్ని మీకు పరిచయస్తుల ద్వారా / మీ స్నేహితుల ద్వారా  ఒక వ్యక్తి ఫోన్ ద్వారా లేదా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుంటారు.

 

 తనకు బాగా నమ్మకమైన ఒక కంపెనీ తెలుసునని ఆ కంపెనీ నందు మనం పెట్టె పెట్టుబడికి రోజూ వారి లెక్కనా వడ్డీని మన ఖాతా ల నందు జమ చేస్తుందని , తాను ఈ విధంగా లబ్ది పొందానని  కావాలంటే మీరు కూడా ఈ విధంగా లబ్ది పొందవచ్చని చెబుతారు.

 

 మీరు ఈ విషయాన్ని నమ్మి కొంత ఆ కంపెనీ నందు పెట్టుబడిగా పెట్టగా మీకు మొదట్లో మీ పేరిట ఒక డిజిటల్ వాలెట్ ని నమోదు చేసి అందుకు మీ యొక్క బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేసి అందులో డబ్బులు వేస్తారు .

 

 ఈ విధంగా లబ్ది పొందిన మీరు ఆ కంపెనీ నందు అధిక మొత్తాలలో పెట్టుబడిగా పెడతారు .  మీకు తెలిసిన వాళ్ళ చేత,  మీ బంధువుల చేత, మీ స్నేహితుల చేత కూడా ఆ కంపెనీ నందు పెట్టుబడి పెట్టిస్తారు ఈ విధంగా మీరు పెట్టిన పెట్టుబడికి కొన్ని రోజుల వరకు మీ పేరిట నమోదు చేసిన డిజిటల్ ఖాతా ల నందు డబ్బులు వేస్తారు.

 

 ఇలా ఆ నోట ఈ నోట పడి జనాలు భారీ మొత్తాలలో పెట్టుబడి పెడతారు , ఈ విధంగా ఆ కంపెనీ వారు వాళ్ళు అనుకున్న మొత్తం లో వచ్చిన తర్వాత కంపెనీ వారు  ఫిరాయిస్తారు,

 

 ఈ విధమైన నేర ప్రవృత్తి తో కోట్లు కొల్ల గొట్టి ఆ సొమ్ముతో ఉడాయిస్తారు ,  ఆ కంపెనీ వారికి సంబంధించిన ఫోన్ నెంబర్‌లను సంప్రదించటానికి ప్రయత్నించగా ఆ నెంబర్ మనుగడ లో లేదని వస్తుంది, దీని తర్వాత మీరు మోసపోయాం అన్న విషయం మీకు అర్థం అవుతుంది .

 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

  1. ఈ విధంగా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే వారిని నమ్మకండి .
  2. మీకు తెలియని లేదా ఇతర వ్యక్తుల ద్వారా పరిచయం అయ్యే ఇటువంటి కంపెనీ ల నందు పెట్టుబడి ని పెట్టకండి .
  3. ఈ విధంగా ఎవరైనా మోస పోయిన ఎడల మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ నందు కానీ లేదా సైబర్ క్రైమ్ పోలీస్ వారిని కానీ సంప్రదించండి.

 

ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని,  సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.

 

                           జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది..

Leave a Reply

Your email address will not be published.