Deducted towards coda Games( Free fire) and Tencent Games(PUBG) Frauds

కర్నూలు, ఆగష్టు 14. మీ ఇంట్లో పిల్లలు మీ యొక్క సెల్ ఫోన్ లో ఫ్రీ ఫైర్ , PUBG లాంటి గేమ్స్ ఆడుతున్నారా ! అందుకు మీ యొక్క బ్యాంక్ అకౌంటు తో లింకు అయినటువంటి సిమ్ ఉన్న సెల్ ఫోన్ లోనే ఈ గేమ్స్ ఆడుతున్నారా! అయితే మీరు జాగ్రత్త?

గేమ్స్ ఆడే వారి ఖాతా నుండి డబ్బులు మాయం అవుతున్నాయి , మొదటగా మీ యొక్క ఖాతా నుండి చిన్న మొత్తాలలో అనగా రూ. 4,00/-, 240/- ,800/- ఇలా అనేక సార్లు అమౌంట్ కట్ అవుతుంది. ఇలా అమౌంట్ కట్ అవుతున్నట్టు మీకు ఎటువంటి ఎస్ ఎమ్ ఎస్ కానీ, సమాచారం కానీ అందదు.

ఇలా చిన్న మొత్తాలలో అనేక సార్లు డబ్బు కట్ అయిన విషయం తెలియక మీరు మీ ఖాతా నుండి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ ఖాతా నందు డబ్బు మాయం అయిన సంగతి మీకు విదితం అవుతుంది .

మీరు ఏ విధంగా డబ్బు కట్ అయినది అని మీ ఖాతా యొక్క స్టేట్‌మెంట్ తీసుకున్నప్పుడు ఆ స్టేట్‌మెంట్ నందు అమౌంట్ Paytm వారికి కట్ అయినట్టు ఉంటుంది . మీరు నాకు పే టీఎమ్ అకౌంటు లేదు ఎలా Paytm నుండి కట్ అయ్యాయి అని ఆ స్టేట్‌మెంట్ తీసుకొని పోలీస్ వారిని ఆశ్రయించగా వారి విచారణ లో ఈ డబ్బులు CODA shop.com/ free fire , Tencent games కు కట్ అయినట్టు చెపుతారు, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇలా చిన్న మొత్తాలలో అమౌంట్ కట్ అయిన అప్పటికి అది మొత్తంగా చూసినప్పుడు వేలలో ఉంటుంది. ఇక్కడ మీ పిల్లలు ఆ గేమ్స్ ను ఆడుతునప్పుడు గేమ్ డిజైన్ చేసిన వారి నుండి నోటిఫికేషన్ లు వస్తాయి .

ఆ నోటిఫికేషన్ యొక్క సారాంశం ఏంటంటే మీరు ఆ గేమ్ లోని సౌకర్యాలను వినియోగించు కోవడం కోసం కొంత అమౌంట్ కట్టమని ఉంటుంది . ఈ గేమ్స్ ఆడటం కోసం ఇంటర్నెట్ సౌకర్యం అవసరం కాబట్టి ఒక సారి మీ పిల్లలు ఆ నోటిఫికేషన్ ను క్లిక్ చేయగానే మీ యొక్క ఖాతా నుండి అమౌంట్ కట్ అవుతాయి .

తీసుకోవాల్సిన జాగ్రత్తలు …

1. మీ పిల్లలు గేమ్స్ కోసం వాడే సెల్ ఫోన్ నందు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింకు అయినటువంటి సిమ్స్ వేయకండి
2. మీరు ఇంటర్నెట్ వాడే సిమ్ మరియు మీ బ్యాంక్ ఖాతా కు లింకు అయినటు వంటి సిమ్ వేరుగా ఉండే విధంగా చూసుకోండి .
3. మీ పిల్లలు వాడే సెల్ ఫోన్ నందు మీ యొక్క debit card /credit card వివరాలను సేవ్ చేయకండి .
4. మీ పిల్లలకు ఇలా game ఆడేటప్పుడు వచ్చే లింకులను మరియు నోటిఫికేషన్ లను క్లిక్ చేయవద్దు అని చెప్పండి.

ఏమైనా సమస్యలు, సందేహాలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు తెలిపారు.


జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.

Leave a Reply

Your email address will not be published.